
ఎస్టీ అభ్యర్థులకు జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ కోర్సులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కం 2 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఎంపిక చేసిన ఇనిస్టిట్యూట్స్‌లో అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఉంటుందని చెప్పారు. www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలని తెలిపారు.