చండూరు మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చండూరు, వెలుగు : లయన్స్​ క్లబ్ ఆఫ్ చండూర్ సేవ ఆధ్వర్యంలో ఆదివారం చండూరు మండల కేంద్రంలో గగన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా కంటి పరీక్షలు చేసుకున్నారు. 

అవసరమైన వారికి మందులు అందజేశారు. లయన్స్ క్లబ్ చండూరు అధ్యక్షుడు సంగు జానయ్య, కార్యదర్శి లతీఫ్ పాష, కోశాధికారి ఏనుగు వెంకట్ రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు ప్రభాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.