
- 8 ఏండ్లలోపు పేద పిల్లలకు ఫ్రీ ట్రీట్ మెంట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: 8 ఏండ్లలోపు పిల్లలకు ఖరీదైన గుండె వైద్యాన్ని ఫ్రీగా అందిస్తున్న అపోలో హాస్పిటల్ ను అభినందించాల్సిందేనని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్అపోలో హాస్పిటల్ లో పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించేందుకు రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమ్(ఆర్మీఎస్కే) ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయగా, కలెక్టర్ ప్రారంభించారు. అపోలో హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణారెడ్డి మాట్లాడుతూ రెండేండ్లలో 800లకు పైగా పిల్లలకు ఉచితంగా గుండె సర్జరీలు చేశామన్నారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు. అపోలో హాస్పిటల్స్ డీన్ డాక్టర్ కే మనోహర్ మాట్లాడుతూ ఈ హెల్త్క్యాంపులో 200 మంది పిల్లలకు ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సమస్య ఉన్నట్టు తేలితే ఉచిత వైద్యం అందజేస్తామన్నారు. హెల్త్క్యాంప్ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందన్నారు. అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ వాసే, కన్సల్టెంట్ పిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ అమోల్ గుప్తా పాల్గొన్నారు.