
కామారెడ్డి, వెలుగు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మే 4 నుంచి 31 వరకు ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి క్రికెట్ సంఘం ప్రెసిడెంట్ మొజమ్ అలీఖాన్, సెక్రటరీ ముప్పారపు ఆనంద్ ఆదివారం తెలిపారు.
ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు , సాయత్రం 4 నుంచి 6 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శిబిరం ఉంటుందన్నారు. జిల్లా క్రికెట్ టీమ్ సెలక్షన్ కూడా ఉంటుందన్నారు. క్రీడాకారుల వయస్సు 13 నుంచి 23 ఏండ్ల మధ్య ఉన్న వారు అర్హులన్నారు. క్యాంపులో పాల్గొనే వాళ్లు తమ వెంట తెల్లని క్రికెట్ దుస్తులు, క్యాన్వాస్ షూస్, క్రికెట్ కిట్ తెచ్చుకోవాలన్నారు.