గడిచిన వారంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తించాయి. డిసెంబర్ 25న కజఖ్‌స్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆదివారం(డిసెంబర్ 29) ఆదివారం దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 179 మంది ప్రాణాలు కోల్పోయారు. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన ఈ విమానంలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవే కాదు, ఆదివారం మరో రెండు విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెట్టాయి. నార్వేలో 180 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న విమానం హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ల అప్రమత్తతతో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక కెనడాలోని హాలిఫ్యాక్స్ స్టాన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో PAL ఎయిర్ లైన్స్కు చెందిన Air Canada Flight 2259 విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రన్ వేపై విమానం స్కిడ్ అయిన కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుంది. ఇలా వరుస ప్రమాదాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో విమానంలో ఎక్కడ కూర్చొని ప్రయాణిస్తే సురక్షితం అన్న చర్చ తెరమీదకు వస్తోంది.
వెనుక కూర్చొంటే సేఫ్..!
కజఖ్‌స్థాన్, దక్షిణ కొరియా రెండు విమాన ప్రమాదాలను పరిశీలిచిన పిదప.. వెనుక సీట్లలో కూర్చుంటే ప్రాణాలతో బయటపడొచ్చు అని నివేదికలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ ఆ ఇద్దరు సిబ్బంది విమానం తోక భాగంలో ఉండటం వల్లే బ్రతికారట. కజఖ్‌స్థాన్ విమాన ప్రమాదంలోనూ అదే నిజమని చెప్తున్నారు. విమానం వెనుక భాగంలో కూర్చొన్న వారిలో ఎక్కువ మంది ప్రాణాలు రక్షించుకోగలిగారని అధికారులు నివేదించారు. వీటికి బలమైన ఆధారాలు ఉన్నాయి. రెండు ప్రమాదాల్లో విమానం తోక భాగం మాత్రమే పూర్తిగా ధ్వంసం కాకుండా మిగిలింది.
ఏ ప్రయాణం సురక్షితం..?
నిజానికి ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు.. ఇలా అన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఆఖరికి నడిచి వెళ్తున్నా.. ఎదురుగా వచ్చినోడు గుద్దడని గ్యారంటీ లేదు. కావున మూర్ఖపు ఆలోచనలు వదిలి నిర్భయంగా ప్రయాణం చేయండి.
ALSO READ | నెలకు రూ.18 వేల వేతనం: ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో కీలక హామీ