పెబ్బేరు, వెలుగు: భవిష్యత్తులో పశు సంపద మరింత పెరగాలని స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి కోరారు. చౌడేశ్వరిదేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గురువారం అంతర్రాష్ట్ర అఖిల భారత ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన, బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
మొదటిరోజు ఐదుగురు విజేతలకు రూ.1.10 లక్షల నగదు బహుమతిని ఆయన స్పాన్సర్ చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు ప్రమోదిని, విజయవర్ధన్రెడ్డి,కరుణశ్రీ, కర్రె స్వామి, బుచ్చారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.