మరికల్, వెలుగు: చిత్తనూర్ వద్ద అమాయక జనాలపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కంపెనీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.హర్షవర్దన్‌రెడ్డి విమర్శించారు. కంపెనీ పెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రభుత్వం వినకుండా అనుమతులు ఇచ్చిందన్నారు. ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ సమస్యను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
వ్యర్థాలను మన్నెవాగులో కలపడంతో వ్యవసాయ బోర్లలో నీళ్లు రంగు మారాయని, రోడ్ల పక్కన వ్యర్థాలు పారబోస్తుంటే ప్రజలు ప్రశ్నించకూడదా అని నిలదీశారు. రెండు ఊళ్లలో పండుగ చేసుకోకుండా, ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు తీసుకెళ్లి కొట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీ శ్రేణులు గొల్ల కృష్ణయ్య, వీరన్న, హరీశ్, మొగులప్ప, గొల్ల రాజు పాల్గొన్నారు.