బెల్లంపల్లి ప్రజల కోసమే పనిచేస్తున్నా: మాజీ మంత్రి గడ్డం వినోద్

బెల్లంపల్లి ప్రజల కోసమే పనిచేస్తున్నా: మాజీ మంత్రి గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పార్టీ ఆఫీసులో ఏడు మండలాల, బెల్లంపల్లి టౌన్ నూతన అధ్యక్షుల ప్రమాణస్వీకారం జరగగా, వినోద్​ పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులకు ఇండ్లతోపాటు ప్రత్యేక అలవెన్స్ లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. 

పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆదేశాలతో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి నియోజకవర్గంలోని మండలాలకు అధ్యక్షులను నియమించారని చెప్పారు. హైకమాండ్​ఇచ్చిన నియామక లెటర్లు చెల్లవని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్ మెంట్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మత్తమారి సూరిబాబు, దేవసాని ఆనంద్, అంకం రవి, బండి రాములు, నాయకులు పాల్గొన్నారు.