
- అధిక కమీషన్లు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తం
- గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మామిడి రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ సీజన్లో మార్కెట్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని గడ్డిఅన్నారం ఫ్రూట్‌మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి చెప్పారు. బాటసింగారంలోని మార్కెట్ఆఫీసులో సోమవారం మామిడి సీజన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కొందరు వ్యాపారులు మాట్లాడుతూ.. మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నాయని, అధికారులు, పాలకవర్గం స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్లోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. రైతులు, వ్యాపారులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అధిక కమీషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్అంజిరెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ఇన్స్పెక్టర్జి.గట్టుమల్లు, హయత్నగర్ఇన్స్పెక్టర్యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్భాస్కరాచారి, మార్కెట్డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.