అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ షురూ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ షురూ

పద్మారావునగర్, వెలుగు:  సికింద్రాబాద్​గాంధీ ఆస్పత్రిలో అమర్​నాథ్ యాత్రికులకు మెడికల్ ఫిట్​నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఆస్పత్రి మెయిన్​బిల్డింగ్ మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డ్స్ విభాగం(ఎంఆర్​డీ)లో ప్రభుత్వం నియమించిన నలుగురు డాక్టర్ల బృందం దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. బ్లడ్​టెస్టులు, ఎక్స్ రే రిపోర్టులను పరిశీలిస్తున్నారు. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే ఫిట్ నెస్​సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితమని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సర్టిఫికెట్ల అందజేస్తామని అధికారులు తెలిపారు.

ఈ రిపోర్టులు తప్పనిసరి:

సీబీపీ, ఈఎస్ఆర్​, సీయూఈ, ఈసీజీ, బ్లడ్​యూరియా, బిఫోర్​లంచ్, ఆప్టర్​లంచ్​ షుగర్ ​టెస్టులు​, బ్లడ్ గ్రూప్ ఆర్​హెచ్​టైప్, సీరం క్రియేటిన్, చెస్ట్​ఎక్స్​రే రిపోర్టులను మెడికల్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక 50 ఏండ్ల వయస్సు పై బడినవారు అదనంగా రెండు మోకాళ్లు, ఎక్స్​రేలు జతపరచాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసిన అప్లికేషన్​ఫారం, గాంధీలో ఇచ్చే అప్లికేషన్​ఫారాలను నింపి, ఒక ఫొటో జతచేసి ఇవ్వాలి. ఈ వైద్య పరీక్షలన్నీ బయట ల్యాబ్​లలో కూడ చేసుకోవచ్చు. సదరు రిపోర్టులను గాంధీలో ఇవ్వాల్సి ఉంటుంది.