హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి. గణేశ్ శోభాయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈ శోభాయాత్రలో వెరైటీ వెరైటీ వినాయకులు దర్శనమిస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, డబ్బులతో తయారు చేసిన వినాయకులను మనం ఇప్పటి వరకు చూశాం కానీ..ఇవాళ హైదరాబాద్ లో ఓ కారుపై స్టీల్ వినాయకుడు కనువిందు చేశాడు. గిన్నెలు,గ్లాసులు,గంటెలు, మన వంటింట్లో ఉండే స్టీల్ వస్తువులు ఏవైతో ఉంటాయో.. వాటన్నింటిని కలిపి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. కారుపై వెరైటీగా ఉన్న ఈ స్టీల్ వినాయకుడు చూడముచ్చటగా ఉన్నాడు..ఈ వెరైటీ స్టీల్ వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు.
మరో వైపు నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 700లకు పైగా ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 18 వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని డీజీపీ జితేందర్ రెడ్డి చెప్పారు.