
మెహిదీపట్నం, వెలుగు: మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేశ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. సీతారాంబాగ్ బాలాజీ స్కూల్ వద్ద పవన్ సింగ్ కొంతకాలంగా గణేశ్ విగ్రహాలను తయారు చేస్తున్నాడు.
ఈ నెల 26న ఉదయం గుర్తుతెలియని వ్యక్తి తయారీ కేంద్రంలోకి చొరబడి దాదాపు10 విగ్రహాలను ధ్వంసం చేసి పారిపోయాడు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదుతో మంగళ్ హాట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.