కూనవరంలో118 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు :  రెండు ఆటోల్లో తరలిస్తున్న గంజాయిని భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఆర్టీఏ చెక్​ పోస్టు సమీపంలో ఆబ్కారీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్​ సూపరింటెండెంట్​కరంచంద్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని కలిమెల ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా హైదరాబాద్​కు ఆటోల్లో తరలిస్తున్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్​తో జిల్లా టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేపట్టింది. 

అనుమానాస్పదంగా వస్తున్న రెండు ఆటోలను ఆర్టీఏ చెక్​పోస్టు సమీపంలో ఆపి తనిఖీ చేయగా రూ.34 లక్షల విలువైన 118 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఆటోల్లోని ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక బాలుడు ఉన్నాడు. ఈ తనిఖీల్లో ఎస్సై గౌతమ్​, సిబ్బంది రామకృష్ణ గౌడ్, హబీబ్, పాషా, వెంకటనారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేశ్​తదితరులు పాల్గొన్నారు.