
జూదం..బెట్టింగ్.. పేకాట లాంటి ఆటలను దేశ వ్యాప్తంగా బ్యాన్ చేశారు. ఎప్పుడో నిషేధించినా.. జనాలు మాత్రం వాటివైపే దృష్టి మరల్చి కుటుంబాలను చిత్తు చిత్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో.. క్రికెట్ సీజన్ లో బెట్టింగ్ కొన్ని కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే బెట్టింగ్ కాయాల్సిందే అనే ధోరణికి జనాలు వచ్చేశారు. జూదం ఆడినా.. ఇలా అసాంఘికకార్యకలాపాల్లో పాల్గొనడం.. ప్రోత్సహించడం పందెం కాయడం.. పేకాట ఆడేవారు .. క్రికెట్ బెట్టింగ్‌ల్లో పట్టుబడితే ఇక్కడ శిక్ష మామూలే.. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా.. మరణించిన తరువాత గరుడపురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసుకుందాం. . . .
బెట్టింగ్ లో సంపాదించినా.. జూదం ఆడినా.. పేకాట ద్వారాసంపాదించిన సొమ్ము అక్రమ సంపాదనే. ఎవరో కష్టపడి సంపాదించిన దానిని ఒక్క క్షణంలో మరొకరు అన్యాయంగా అనుభవిస్తారు. ప్రస్తుతం క్రికెట్ సీజన్ జరుగుతుంది. బెట్టింగ్‌ల ద్వారా చాలామంది అన్యాయంగా.. అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇలాంటి వారు యమలోకంలో కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది.
జూదం : జూదం ఆడిన వారిని మరణించిన తరువాత యమలోకంలో ఇనుప గొలుసులను కాల్చి వాటితో కట్టేస్తారు. అక్రమంగా.. డబ్బు సంపాదించిన వారు భూలోకంలో సుఖ పడినా.. యమలోకంలో మాత్రం పడే కష్టాలు.. అనుభవించే శిక్ష అంంతా ఇంతా కాదు. అప్పుడు జూదం వలన ఇతరులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధలు పడాల్సిందే.. కాబట్టి జూదం ఆడేటప్పుడు యమలోకం పడే శిక్షల గురించి ఆలోచించండి.
Also Read:-తినే తిండిని బట్టే బుద్దులు.. ఙ్ఞానం వస్తాయి..!
రౌరవ నరకం: మోసం చేసేవాళ్లు.. బెట్టింగ్‌లో పాల్గొనే వారు.. నిర్వహించేవారు యమలోకంలో ఈ ప్రాంతానికి పంపబడతారు. ఇక్కడ నరరూప రాక్షసులు జంతువుల రూపంలో ఉంటారు. రౌరవ నరకానికి వచ్చిన వారిని ఎర్రగా కాలుతున్న ఇనుప సువ్వలపై ఉడికిస్తూ.. నానా హింసలు పెడతారు. యమలోకంలో ఈ ప్రాంతంలో మరణం ఉండదు. అలా కాలుతూ ఉండాల్సిందే.. పందెంలో ఆడి భూలోకంలో ఇబ్బంది పడినవారికి శిక్ష మోతాదు కాస్త తక్కువుగా ఉంటుంది. కాని శిక్ష మాత్రం అనుభవించి తీరాల్సిందే.
చీకటి నరకం: ఇతరులకు దక్కాల్సిన డబ్బును.. ఆస్తిని.. చట్ట విరుద్దంగా సంపాదిస్తే చీకటి నరకానికి పంపుతారు. ఇక్కడ అంతా చీకటిగా ఉంటుంది. వారు ఏమీ చూడలేరు. ఎత్తైన కొండలపై ఇనుప శూలాలు ఉంచి వాటి పై నుంచి జార విడుస్తారు. పక్కకు వెళదామంటే అంతా చీకటిమయంగా ఉంటుంది. కొండపైనుంచి జారేటప్పుడు ఇనుప శూలాలు గుచ్చుకొని విలవిలలాడిపోతారు. భూలోకంలో చిన్నరేగి ముల్లు గుచ్చుకున్నా భరించలేం కదా,..! మరి యమలోకంలో ఈ శిక్షను ఎలా అనుభవిస్తారో మరి . కాబట్టి ఇతరులకు చెందాల్సినదానిని వారికే ఇచ్చేయండి.. అందులో మీకు న్యాయపరంగా ఎంతమేరకు రావాలో అంతే తీసుకోండి.
మరణించిన తరువాత పాపు పుణ్యాలను లెక్కించి స్వర్గ లోకానికి.. యమలోకానికి వెళతామని గరుడపురాణం చెబుతుంది. స్వర్గ లోకానికి వెళితే ఇబ్బందులు ఉండవు.. అదే యమలోకానికి తీసుకెళ్తుంటే పడే బాధలు.. అనుభవించేశిక్షలు అన్నీ ఇన్నీ కావు.. పాపాలను.. అసాంఘిక కార్యకలాపాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా శిక్షిస్తారు యమభటులు.
క్రికెట్ బెట్టింగ్.. పలు విషయాల్లో పందెం కాయడం.. జూదం ఆడటం.. పేకాట ఆడటం.. నోరులేని జంతువులను హింసించే వారు తామిశ్ర లేదా .. రౌరవ నరకానికి వచ్చినప్పుడు ..రౌరవం అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తనవారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు మిన్నాగులుగా మారి విషం కక్కుతూ మొర్రొమని మొత్తుకున్నా, ఇంతకన్నా చావేసుఖం మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు.
బెట్టింగ్ వలన కొంతమంది జూదగాళ్లు పేదరికంతో అలమటిస్తూ జీవనం గడుపుతారు. మరికొంతమంది క్షణాల్లో డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతారు. గరుడపురాణం ప్రకారం అలాంటి వారు తరువాత జన్మలో పేదరికం.. మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతూ.. ఇతరుల నుంచి అవమానాలు ఎదుర్కొంటాడు. సో బెట్టింగ్ రాయుళ్లు తస్మాత్ జాగ్రత్త..