గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి

గుండెపోట్లు ఎప్పుడు, ఎక్కడ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు.వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యల  గుండెపోట్లు వస్తున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలిపోతున్నారు.

లేటెస్ట్ గా హనుమకొండ జిల్లా  గోపాల్ పూర్ లో  గీత కార్మికుడు తాటిచెట్టుపైనే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. పరిమళ కాలనిలో  బైరగోని యాదగిరి తాటిచెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. తాటిచెట్టు పై నుంచి కిందకు వేలాడుతుండగా గమనించిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన యాదగిరిని కిందకు దించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.