హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం సైతం కొనసాగింది. ఎల్ బీనగర్, ఖైరతాబాద్ జోన్లలోని ఆయా సర్కిల్ ఆఫీసుల ముందు ఆందోళన చేపట్టారు. తాము చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతే మిగతా పనులు ఎలా చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఉన్న రూ.1,100 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హెడ్డాఫీస్, జోనల్ఆఫీసుల ముందు ఆందోళన నిర్వహిస్తామన్నారు. బిల్లులు ఇవ్వకపోతే అప్పటివరకు పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేందర్ సింగ్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.