- పాలక మండలి ఏర్పడిన తర్వాత తొలి సమావేశం
- ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు సమావేశం
- 22 అంశాలపై చర్చించనున్న జనరల్ బాడీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సర్వ సభ్య సమావేశం రేపు ఉదయం 10.30 గంటలకు జరగనుంది. పాలక మండలి ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సర్వ సభ్య సమావేశం ఇదే. ఈ మీటింగ్ లో మొత్తం 22 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించారు. ముందుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం తరువాత ఇటీవల మరణించిన మాజీ సీఎం రోశయ్య, బిపిన్ రావత్, కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత చనిపోయిన లింగోజి గూడ కార్పొరేటర్ రమేష్ సంతాప తీర్మానాలు చేస్తారు. అనంతరం 22 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. సాయంత్రం వరకు సమావేశం జరగనున్న నేపథ్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికి గంజాయి రవాణా ముఠా అరెస్ట్