latesGHMC స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. మొత్తం 17 నామినేషన్లు

latesGHMC  స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. మొత్తం 17 నామినేషన్లు

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ గడువు ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.  జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి  8, కాంగ్రెస్ నుంచి 7, BRS నుంచి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.  ఫిబ్రవరి 18న  స్క్రూటినీ, 21 న విత్ డ్రాకు అవకాశం ఉంది . ఫిబ్రవరి 25 న ఎన్నికలు.. ఆరోజే రిజల్ట్స్ వెలువడనున్నాయి.  తమకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో  BRS నామినేషన్లు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో ఉంది.   

గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా ప్రస్తుతం 146 కార్పొరేటర్లు ఉన్నారు.  గత తొమ్మిదేళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుంది స్టాండింగ్ కమిటీ.  గతంలో BRS నుంచి 8 MIM నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ ఉండేవారు. 

స్టాండింగ్ కమిటీ అంటే ఏమిటి:

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం జరగాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక రకంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అన్నమాట. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఈ లెక్కన 150 మంది కార్పొరేటర్లకు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక అవుతారు.