- బోరబండ రిజర్వాయర్ పరిధిలో అంతరాయం
హైదరాబాద్: నగరంలోని లింగంపల్లి నుంచి బోరబండ వరకు ఉన్న 800 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ స్థానంలో కొత్తగా 800 ఎంఎం డయా ఎంఎస్ పైప్ లైన్ వేయాలని జలమండలి నిర్ణయించింది. 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు 28న శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. అందువల్ల 24 గంటలు బోరబండ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. 28.01.2022 నాడు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నీటి సరఫరా జరుగుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6, 9: బోరబండ, అల్లాపూర్, గాయత్రినగర్, పర్వత్నగర్, వివేకానందనగర్, ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్నగర్, కార్మిక నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
ఇవి కూడా చదవండి
ఒక్క మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా టాలెంట్ అంచనావేయలేం
కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం