ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌‌కు​ జీజేఎల్ఏ మద్దతు

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌‌కు​ జీజేఎల్ఏ మద్దతు

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూల రవీందర్​కు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (జీజేఎల్ఏ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శనివారం పూల రవీందర్​కు.. జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూధన్ రెడ్డి, బల్ రామ్ జాదవ్ మద్దతు లేఖను అందించారు.

గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్.. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి ఆయన మద్దతిచ్చారని వెల్లడించారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆయనకు జీజేఎల్ఏ మద్దతిస్తున్నట్టు వెల్లడించారు.