
చిన్నచింతకుంట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే సబ్సిడీ ద్వారా గ్యాస్ అందిస్తున్నట్టు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బలుసుపల్లి, మినిగోనిపల్లి, చౌదర్ పల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. మహిళా శక్తి క్యాంటిన్ల తీసుకువచ్చామని, మహిళలు వ్యాపారం చేసుకునేలా శిల్పరామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. స్కూల్ యూనిఫాంలో కుట్టే బాధ్యత అమ్మ స్కూల్స్ పనులు సైతం మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. దసరా నుంచి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.