మీకు గోబీ మంచూరియా బాగా ఇష్టమా...? హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా ఇష్టంగా తింటారా..? అయితే మీరు ఒక్క సారి..ఒకే ఒక్కసారి హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా ఎలా తయారు చేస్తారో చూడాల్సిందే. ఆ తర్వాత దాన్ని తినాలా ..? వద్దా ..? అని నిర్ణయించుకోండి..!
ఇక్కడ కొంత మంది యువకులు..అర్థనగ్నంగా ఉండి గోబీ మంచూరియాను తయారు చేస్తారు. ముందుగా 500 కిలోల క్యాబేజీని కట్ చేస్తారు. ఆ తర్వాత కట్ చేసిన క్యాబేజీని ఓ ప్లాస్టిక్ ట్రేలో నింపుతారు.
ALSO READ :Cricket World Cup 2023:ఈ ఎండను తట్టుకోలేం: చెన్నైలో సూరీడు దెబ్బకు కుదేలైన వార్నర్,స్మిత్
ఆ క్యాబేజీ తురుంను భారీ గిన్నెలో పోసి..ఉప్పు, పిండి, నీళ్లు పోసి..చేతులతో చిత్ర విచిత్రంగా కలుపుతారు. ఆ సమయంలో అతను షార్ట్ తప్ప..శరీరంపై టీ షర్ట్ కానీ,..షర్ట్ కానీ వేసుకోడు. పిండి కలిపిన గోబీని మరో భారీ గిన్నెలో వేసి..చిన్న చిన్న బంతుల మాదిరి తయారు చేసుకుని...నూనెలో ఫ్రై చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో మస్తు వైరల్ అయింది. ఇప్పటికే 5.4 మిలియన్ల మంది వీక్షించారు. అయితే చాలా మంది నెటిజన్లు ఈ గోబీ మంచూరియా తయారీపై భిన్నంగా స్పందిస్తున్నారు. శుభ్రత లేదు..కనీసం నిబంధనలు పాటించలేదు..ఇదేం గోబీ మంచూరియా అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది అపరిశుభ్రమైన వంటగది..RIP పరిశుభ్రత అంటూ మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇంకో వ్యక్తి అయితే...గోబీ మంచూరియాలో మనిషి చెమట కూడా కలిసింది.. అంటూ కామెంట్ చేశాడు.