సింగరేణి ఓసీపీ 5 ముట్టడి

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్​ కాస్ట్​ 3, 5 ప్రాజెక్ట్​లలో చేస్తున్న భారీ బ్లాస్టింగ్​ల వల్ల 10, 11, 12, 13, 33, 34 డివిజన్లతో పాటు గోదావరిఖని ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొంటూ 12వ డివిజన్​ కార్పొరేటర్​ బొడ్డు రజిత, రవీందర్​ ఆధ్వర్యంలో శుక్రవారం ఓసీపీ 5ను ముట్టడించారు. రోడ్డుపైనే బైఠాయించి సింగరేణి మేనేజ్​మెంట్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్లాస్టింగ్​ తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్​ ఆఫీసర్​ చంద్రశేఖర్​ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.