హైదరాబాద్​ మార్కెట్లోకి గోద్రేజ్ ప్రాపర్టీస్

హైదరాబాద్​, వెలుగు:  గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ హైదరాబాద్‌‌లో అడుగుపెట్టింది. తన మొదటి హౌసింగ్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు రూ.1,300 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు   తెలిపింది. కంపెనీ హైదరాబాద్‌‌లో తన మొదటి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'గోద్రేజ్ మాడిసన్ అవెన్యూ'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 

ఇది కోకాపేటలో 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్​లో దాదాపు 12 లక్షల చదరపు అడుగుల అమ్మకపు ప్రాంతం ఉంటుంది. బుకింగ్ విలువ సుమారు రూ.1,300 కోట్లు ఉంటుందని గోద్రేజ్ ప్రాపర్టీస్ తెలిపింది. ఈ కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ–ఎన్సీఆర్​ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), బెంగళూరు, పూణే హౌసింగ్ మార్కెట్లలోనూ వ్యాపారం చేస్తోంది.