న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరల ర్యాలీ వల్ల బుధవారం ఢిల్లీలో బంగారం ధరలు రూ.900 పెరిగి 10 గ్రాములకు రూ.77,850కి చేరాయి. ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర మంగళవారం 10 గ్రాములకు రూ.76,950 వద్ద ముగిసింది. డిమాండ్పెరగడంతో వెండి కిలో ధర రూ. మూడు వేలు పెరిగి రూ. 93వేలకు చేరింది.
అదనంగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ. 900 పెరిగి 10 గ్రాముల ఆల్ టైమ్ హై లెవెల్ రూ.77,500కి చేరుకుంది. క్రితం సెషన్‌లో మెటల్ 10 గ్రాముల ధర రూ.76,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు సమీప భవిష్యత్తులో ఔన్స్‌కు 3,200 డాలర్లను అధిగమించే అవకాశం ఉంది.