Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?

Gold rates:  మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?

రోజురోజుకు గోల్డ్ రేట్స్  పెరుగుతున్నాయి. బంగారం ధరలు  రికార్డు దిశగా పరుగులు పెడుతున్నాయి. జనవరి 21న  స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా 860 పెరిగింది.  బుధవారం (జనవరి 22, 2025) ఉదయం నాటికి రూ. 82 వేల మార్క్ ను దాటేసింది. 

 22 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి 7, 5250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 860 పెరిగి 82 వేల 90కి చేరింది.

బుధవారం(జనవరి 22)  నమోదయిన ధరల ప్రకారం..10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర  రూ75వేల250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.82 వేల90 గా ఉంది. ఇక  కేజీ సిల్వర్ ధర రూ. లక్షా 4వేలుగా ఉంది. 

 హైదరాబాద్ లో బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,250
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,090