ఒక్క రోజే బంగారం ధర రూ.2,430 పైకి

ఒక్క రోజే బంగారం ధర రూ.2,430 పైకి
  • 88కి దగ్గరగా డాలర్ మారకంలో రూపాయి విలువ

న్యూఢిల్లీ: ఒకవైపు బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతుంటే మరోవైపు రూపాయి విలువ తగ్గుతోంది. 10 గ్రాముల గోల్డ్ రేటు సోమవారం రూ.2,430 పెరిగి రూ.88,500కి చేరుకుంది. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో గోల్డ్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కావడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి ఒక కారణం. రూపాయి విలువ సోమవారం 88 లెవెల్‌‌ వరకు తగ్గింది. చివరికి కొంచెం బలపడి 87.45 దగ్గర సెటిలైంది.

డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోవడంతో గోల్డ్‌‌కు ఎక్కువ అమౌంట్‌‌ చెల్లించాల్సి వస్తోంది. గ్లోబల్ మార్కెట్‌‌లో బంగారం ధర ఔన్సుకు 2,900 డాలర్లను దాటింది. వెండి రేట్లు కూడా సోమవారం కేజీకి రూ.1,000 పెరిగి రూ.97,500కు చేరుకున్నాయి. గ్లోబల్‌‌గా అనిశ్చితి నెలకొనడడంతో ఇన్వెస్టర్లు షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్స్‌‌ నుంచి ఫండ్స్ విత్‌‌డ్రా చేసుకుంటున్నారని, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌లో పెడుతున్నారని అనలిస్టులు పేర్కొన్నారు. ఎంసీఎక్స్‌‌లో బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర రూ.940 పెరిగి ఆల్‌‌టైమ్ గరిష్టమైన 85,828 లెవెల్‌‌ను టచ్ చేసింది.