ఘనంగా పీడీఎస్ యూ స్వర్ణ జయంతి ఉత్సవాలు : ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ ప్రదర్శన

ఘనంగా పీడీఎస్ యూ స్వర్ణ జయంతి ఉత్సవాలు : ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ ప్రదర్శన

ఓయూ, వెలుగు: ఓయూ క్యాంపస్​లో పీడీఎస్ యూ స్వర్ణజయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్ కళాశాల కాలేజీ నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ డప్పు బృందాలతో వేలాది మంది విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. జార్జ్​రెడ్డి, జంపాల చంద్రశేఖర్ తోపాటు విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ, హైకోర్టు రిటైర్డ్ జడ్జి కోల్సే పటేల్, ప్రొఫెసర్ హరగోపాల్, పోటు రంగారావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ప్రొఫెసర్ ఖాసిం, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, నామాల ఆజాద్ పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ కాసిం, విద్యార్థి నాయకులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలువరించిన ‘సమరశీల స్ఫూర్తి పీడీఎస్ యూ’ అనే పుస్తకాన్ని కోల్సే పాటిల్, ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు.