కాగజ్ నగర్, వెలుగు: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఆదివారం గోండి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రాయి సెంటర్ సర్మేడి కొడప శంకర్ మాట్లాడుతూ.. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి గోండి భాష అని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గోడి భాష వృద్ధి కోసం మోతిరాం రావణ్ కంగాలి లాంటి మహాత్ములు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
ఆయన జన్మదినాన్ని పురస్కరించు కొని గోండిబాషా దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయి సెంటర్ సార్మేడి కొడప శంకర్, ఉపమేడి ఆత్రం బక్కయ్య, సలహాదారు ఎ.శంకర్, ఆదివాసి జేఏసీ గౌరవ అధ్యక్షుడు సిడం సకారం, కార్యదర్శి కె.పుల్లయ్య, పి.వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి తుకారాం తదితరులు పాల్గొన్నారు.