
Gold Price Today: గడచిన వారంలో బంగారం ధరల నిరంతరం పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ వారం ట్రంప్ తన టారిఫ్స్ విధానంలో మార్పులను ప్రకటించటంతో పాటు ఇప్పటికే చాలా దేశాలపై టారిఫ్స్ 90 రోజుల పాటు తగ్గిస్తున్నట్లు ప్రకటించటం ప్రపంచ బులియన్ మార్కెట్లపై ఒత్తిడిని కొంత మేర తగ్గించింది. అయితే పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నందున చాలా మంది ఇప్పటికే తమ పసిడి షాపింగ్ చేసేందుకు వేచి చూస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు తగ్గిన రిటైల్ ధరలను పరిశీలించాకే షాపింగ్ చేయటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.వెయ్యి 500 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 755, ముంబైలో రూ.8వేల 755, దిల్లీలో రూ.8వేల 755, బెంగళూరులో రూ.8వేల 755, కలకత్తాలో రూ.8వేల 755, కేరళలో రూ.8వేల 755, వడోదరలో రూ.8వేల 760, జైపూరులో రూ.8వేల 770, లక్నోలో రూ.8వేల 770, మంగళూరులో రూ.8వేల 755, నాశిక్ లో రూ.8వేల 758, మైసూరులో రూ.8వేల 755, అయోధ్యలో రూ.8వేల 770, బళ్లారిలో రూ.8వేల 755, గురుగ్రాములో రూ.8వేల 770, నోయిడాలో రూ.8వేల 770 వద్ద రిటైల్ విక్రయాలు కొనసాగుతున్నాయి.
Also Read : యూఎస్ చైనా టారిఫ్ వార్ ఎఫెక్ట్
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.వెయ్యి 600 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 551, ముంబైలో రూ.9వేల 551, దిల్లీలో రూ.9వేల 566, బెంగళూరులో రూ.9వేల 551, కలకత్తాలో రూ.9వేల 551, కేరళలో రూ.9వేల 551, వడోదరలో రూ.9వేల 556, జైపూరులో రూ.9వేల 566, లక్నోలో రూ.9వేల 566, మంగళూరులో రూ.9వేల 551, నాశిక్ లో రూ.9వేల 554, మైసూరులో రూ.9వేల 551, అయోధ్యలో రూ.9వేల 566, బళ్లారిలో రూ.9వేల 551, గురుగ్రాములో రూ.9వేల 566, నోయిడాలో రూ.9వేల 566గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.87వేల 550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులం(10 గ్రాములకు) రూ.95వేల510గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 తగ్గి రూ.లక్ష 9వేల 900 వద్ద కొనసాగుతోంది.