
వరంగల్, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, డబుల్ ఇండ్ల విషయంలో ప్రభుత్వం బద్నాం అవుతుందని, ప్రతి ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. టీయూడబ్ల్యూజే (హెచ్143) ఆధ్వర్యంలో మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీకి అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మారుతీసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్లు చొరవ చూపాలన్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.
అనంతరం ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో గెలిచిన వారిని సన్మానించారు. అంతకుముందు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల కోసం ఎమ్మెల్యే నరేందర్ నిర్మించిన డబుల్ బెడ్‍రూం ఇండ్లను పరిశీలించారు. ఈ ఇండ్లు రోల్ మోడల్‌గా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకన్న, యూనియన్ నేతలు మస్కపురి సుధాకర్, బీఆర్ లెనిన్, శంకేసి శంకర్, నాయకపు సుభాష్, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కక్కెర్ల అనిల్, పొగాకుల అశోక్, మెండు రవీందర్, రాజ్‍నారాయణ పాల్గొన్నారు.