ఇయాల్టి నుంచే పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌‌‌‌

ఇయాల్టి నుంచే  పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌‌‌‌
  • మార్చి 31, 2026 వరకు  అందుబాటులో

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెచ్చిన పీఎం ఈ–డ్రైవ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌  మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు  అందుబాటులో ఉంటుంది.  ఈ స్కీమ్ కింద ఈవీలను ప్రమోట్ చేసేందుకు, వీటి తయారీని పెంచేందుకు, ఛార్జింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసేందుకు   రూ.1‌‌‌‌‌‌‌‌0,900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌‌‌‌ (ఈఎంపీఎస్‌‌‌‌) 2024   పీఎం ఈ–డ్రైవ్‌‌‌‌లో  విలీనమవుతుంది. ఈఎంపీఎస్‌‌‌‌ కింద ఇచ్చే బెనిఫిట్స్ ఇక నుంచి పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్ ద్వారా అందుతాయని కేంద్రం నోటిఫై చేసింది. కాగా, ఈ స్కీమ్‌‌‌‌ కింద ఎలక్ట్రిక్  టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఈ–అంబులెన్స్‌‌‌‌లు, ఈ–ట్రక్కులకు  సబ్సిడీని ఇవ్వనున్నారు.

ఎలక్ట్రిక్ బస్సులనూ సపోర్ట్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ–బస్సుల కోసం రూ.4,391 కోట్లను, టూవీలర్ల కోసం రూ.1,772 కోట్లను  ప్రభుత్వం కేటాయించింది.  అంతేకాకుండా ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందాలంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి తయారయ్యే ఈవీ కాంపోనెంట్లలో 50 శాతం లోకల్‌‌‌‌గా సేకరించిన ప్రొడక్ట్‌‌‌‌లు ఉండాలి.  2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ టూవీల్లరకు ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్  బండికి రూ.5 వేలకు తగ్గుతుంది. త్రీవీలర్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే సబ్సిడీని బండికి రూ.25 వేలకు పరిమితం చేశారు.