ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం.. ఇకపై మరింత పవర్ ఫుల్‎గా హైడ్రా

ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం.. ఇకపై మరింత పవర్ ఫుల్‎గా హైడ్రా

హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) ఆర్డినెన్స్‎కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. తాజాగా హైడ్రా ఆర్డినెన్స్‎కు రాజ్ భవన్ నుండి ఆమోదం లభించడంతో ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్‎గా మారనుంది.

Also Read :- కాకా ఎవ్వరికీ భయపడే వ్యక్తి కాదు

ఆర్డినెన్స్‎కు గ్రీన్ సిగ్నల్ రావడంతో  హైడ్రాకు ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. హైడ్రాకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో హైడ్రాకు చట్టబద్దత లభించడం గమనార్హం. హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం తెలపడంతో రానున్న ఆరు నెలల వ్యవధిలో అసెంబ్లీలో బిల్లు రూపంలో చర్చకు పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందడం తప్పనిసరిగా మారింది.