నలుగురికి గవర్నర్​ ప్రతిభా పురస్కారాలు

నలుగురికి గవర్నర్​ ప్రతిభా పురస్కారాలు
  • మరో నాలుగు సంస్థలకూ అవార్డులు
  • ప్రకటించిన రాజ్​భవన్​
  • ఈ నెల 26న అందజేయనున్న గవర్నర్

హైదరాబాద్, వెలుగు: వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, సంస్థలకు గవర్నర్ ప్రతిభా పురస్కారాలను రాజ్ భవన్ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభయ్య  సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, స్పోర్ట్స్, కల్చర్, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన వారికి ఏటా గణతంత్ర 
దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ నిర్ణయించారు. 

ఇందులో భాగంగా దరఖాస్తులు కోరగా నాలుగు కేటగిరీలకు 594 అప్లికేషన్లు వచ్చాయి. అప్లై చేసుకున్న వారిలో 16 ఏండ్ల స్టూడెంట్​ నుంచి 89 ఏండ్ల వృద్ధుల వరకు ఉన్నారు.ఈ అప్లికేషన్లను రిటైర్డ్ ఐఏఎస్, జ్యూరీ కమిటీ చైర్మన్ పద్మనాభయ్య, పుల్లెల గోపీచంద్, పర్యావరణ వేత్త అనిల్ కుమార్, హనుమంతరావు, కూచిపూడి కళాకారిణి పద్మజారెడ్డి పరిశీలించి వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేశారు. ఈ అవార్డులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్​లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేయనున్నారు. అవార్డుతోపాటు రూ.2 లక్షల నగదును కూడా అందజేయనున్నట్టు దాన కిషోర్ వెల్లడించారు. 

ఎంపికైన వ్యక్తులు, సంస్థలు

1. దుశర్ల సత్యనారాయణ : పర్యావరణ వేత్త

2. అరికపూడి రఘు: దివ్యాంగుల సంక్షేమం

3. జీవాంజి దీప్తి: పారా ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజేత 

4. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం. పాండు రంగారావు,

పీబీ కృష్ణ భారతి: కల్చర్

5. ధ్రువాంశు ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పర్యావరణ పరిరక్షణ

6. ఎల్వీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటి ఆస్పత్రి: దివ్యాంగుల సంక్షేమం

7. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: క్రీడలు

8. సంస్కృతి ఫౌండేషన్: కల్చర్