ఢిల్లీ : అగ్ని ప్రమాద బాధితులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. గోకుల్పురి ప్రాతానికి వెళ్లిన ఆయన.. ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మంటల్లో చిక్కుకుని చనిపోయిన పెద్దల కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్నారుల ఫ్యామిలీలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పరిహారం ఇస్తామని చెప్పారు. గూడు కోల్పోయిన వారికి రూ.25,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
I'm saddened by fire incident in which 7 people died. Poor make their shelter after a lot of hardwork. Govt will give Rs.10 lakh each to deceased adults' families, Rs.5 lakh to deceased children's families and Rs 25,000 to those whose shanties were burnt: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/atCRzT8qv3
— ANI (@ANI) March 12, 2022
ఢిల్లీలోని గోకుల్పురిలోని మురికివాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 60 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
మరిన్ని వార్తల కోసం..
ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు
రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగింది