కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల సందడి .. సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
  • భారీ ర్యాలీలతో దద్దరిల్లిన ప్రధాన సెంటర్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు సోమవారం చివరి రోజు కావడంతో కరీంనగర్ సిటీలో సందడి నెలకొంది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ అనుచరగణంతో భారీగా తరలిరావడం, ర్యాలీలు నిర్వహించడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీకి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్‌‌‌‌‌‌‌‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. మంత్రుల రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇండిపెండెట్లు సైతం యాభై, వంద మందితో ర్యాలీలు నిర్వహించారు. దీంతో సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌లోకి మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు వాహనం వెళ్లడంతో మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌ అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు.