
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా చలిబోనాలు నిర్వహించారు. పోచమ్మకు మహిళలు బోనాలు ఎత్తుకొని పోచమ్మ వద్దకు డప్పుచప్పుల్ల మధ్య వెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. పోచమ్మ దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.