
తుంగతుర్తి, వెలుగు : పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకండ్ల దామోదర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలగిరి మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించుకున్న నూతన సంఘం భవనం, పెన్షనర్ల పితామహుడు డీఎస్ నకార విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదటి తారీఖున పెన్షన్లు ఇస్తుంద తప్ప.. సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని, రెండో పీఆర్సీ కమిటీ నివేదికను ప్రకటించి వెంటనే అమలు చేయాలని డిమాండ్చేశారు. రాష్ట్ర సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.