గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్డేట్?

మహేష్​ బాబు(Mahesh babu) హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్(Trivikram) లో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం.టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీలీల,మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

ఇక లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. గుంటూరు కారం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ రిలీజ్కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సాంగ్తో మంచి హైప్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. అందుకోసం థమన్ అదిరిపోయే ట్యూన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ను వినాయక చతుర్థి స్పెషల్గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. 

ఇటీవల కృష్ణ బర్త్ డే సందర్భంగా మాస్‌‌‌‌ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌‌‌‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్‌‌‌‌ స్టైలిష్ లుక్, యాటిట్యూడ్, మాస్ అప్పియరెన్స్ ఆకట్టుకున్నాయి. మొదటిరోజునే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ అందుకుని టాలీవుడ్‌‌‌‌లో హైయస్ట్ వ్యూస్‌‌‌‌ అందుకున్న గ్లింప్స్‌‌‌‌గా నిలిచింది.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ తో ఫ్యాన్స్ ఖుషి అయ్యినట్లు తెలుస్తుంది. ఇక త్వరలో రాబోయే ఫస్ట్ సింగిల్ తో  ఫ్యాన్స్ కి ఇక పూనకాలే. ఇక ఈ సాంగ్ ఆఫీసియల్ అప్డేట్ త్వరలో..మేకర్స్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పై చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.