
మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ‘ధమ్ మసాలా’ సాంగ్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నేనో నిశబ్దం.. నాతో నాకే యుద్ధం’ అంటూ ఆ పాట ద్వారా మహేష్ క్యారెక్టర్‌ను పరిచయం చేయడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
3ఓ మై బేబీ’ అంటూ సాగే సెకెండ్ సాంగ్‌ను డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు, ప్రోమోను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్టు శనివారం అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్‌ను శ్రీలీల కిస్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ పాటపై ఆసక్తిని పెంచేలా ఉంది. తమన్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.