Jobs Alert:హెచ్ఏఎల్​లో డిప్లొమా టెక్నీషియన్..

Jobs Alert:హెచ్ఏఎల్​లో డిప్లొమా టెక్నీషియన్..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 7వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 16

పోస్టులు: డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) –ఎఫ్ఎస్ఆర్ 01, డిప్లొమా టెక్నీషియన్(ఎలక్ట్రికల్)–ఎఫ్ఎస్ఆర్  02, డిప్లిమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్)–ఎఫ్ఎస్ఆర్ 13. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: అన్ రిజర్వ్​డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24.
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: మే 5.

సెలెక్షన్ ప్రాసెస్:  హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ మే 25. పూర్తి వివరాలకు www.halindia.co.in లో సంప్రదించగలరు.