
- హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి
పిట్లం, వెలుగు: ప్రపంచంలో అందరూ శాంతి సంతోషాలతో ఉండాలని కోరుకునేది హిందూ ధర్మం మాత్రమేనని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. ఆదివారం పిట్లం మండలం తిమ్మానగర్లో శాలివాహన కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రుక్మిణి పాండురంగ సహిత గోరకుంభార్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామిజీ ప్రవచనం వినిపించారు. సర్వేజనా సుఖినోభవంతు అని చెప్పేది హిందూ ధర్మం మాత్రమేనని, ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. అంతకుముందు విగ్రహ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం భగవన్నామస్మరణతో మార్మోగింది. భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాదం పంపిణీ చేశారు.