దివ్యాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

దివ్యాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
  • వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు దివ్యాంగులకు కాంగ్రెస్​ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.6వేలు పెన్షన్, కండరాల క్షీణత కలిగిన వారికి రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మంగళవారం సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అధ్యక్షతన ధర్నాచౌక్​లో చేయూత పెన్షన్ దారులు మహా ధర్నా నిర్వహించారు. మందకృష్ణ మాదిగ, సోమన్న, ఎల్.గోపాల్ రావు, సుజాత, సూర్య వంశీ, అందే రాంబాబు, పెద్దపల్లి సత్యనారాయణ, మంగమ్మ హాజరయ్యారు.