My Name Is Shruthi Review: మై నేమ్ ఇజ్ శృతి రివ్యూ.. ట్విస్టులతో మెప్పిస్తుంది

My Name Is Shruthi Review: మై నేమ్ ఇజ్ శృతి రివ్యూ.. ట్విస్టులతో మెప్పిస్తుంది

హీరోయిన్ హన్సిక (Hansika Motwani) లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో..ఓంకార్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’(My Name Is Shruthi).  బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన సినిమా ఇవాళ (నవంబర్ 17న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హన్సిక కీల‌క పాత్ర పోషించింది. చాలా రోజుల త‌ర్వాత హన్సిక చేసిన తెలుగుమూవీ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కిన ఈ మూవీ..ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

కథ :

ఈ సినిమా టైటిల్ రోల్ లో నటించిన శృతి (హ‌న్సిక‌) యాడ్ ఏజెన్సీలో ఒక ఎంప్లాయ్. శృతి చిన్నతనంలోనే తన తండ్రి మరణించడంతో  తాత, అమ్మ పెంప‌కంలో పెద్ద‌దవుతుంది. చరణ్ ( సాయి తేజ)తో ప్రేమలో ఉన్న శృతి..లైఫ్ చాలా సాఫీగా సాగిపోతూంటుంది. అలాంటి క్రమంలోనే ఎమ్మెల్యే గురుమూర్తి (న‌రేన్‌) అక్రమంగా చేసే ఇల్లీగల్ బిజినెస్ ను గుర్తిస్తుంది. అలా అనుకోకుండా ముఠా వ‌ల‌లో హన్సిక చిక్కుకుంటుంది. దీంతో స్కిన్ మాఫియా చేసే ముఠాలో ప్రధాన వ్యక్తిగా ఉండే గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ..ఒక్కొక్కటి శృతికి తెలుస్తూ వస్తాయి. ఇలాంటి ముఠా వలలో చిక్కుకుపోయిన పేదింటి పిల్లలు..బందీగా మిగిలిపోయి వారి సర్వస్వం కొల్పుతుంటారు. అలాంటి క్రమంలోనే ముఠా వలలో హన్సిక చిక్కుకోవడం..ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేమిటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెనుక అసలు ఎవ‌రున్నారు? ఇంకా ఈ స్కిన్ మాఫియాలో ఎవరెవరు భాగం అయ్యారు?  ఈ ముఠాపై శృతి పోరాటం ఎలా చేసిందనేది థియేటర్లో చూడాల్సిందే.

కథ ఎలా ఉందంటే: 

‘కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఒక సోషల్ ఇష్యూని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రం. కంప్లీట్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే బేస్డ్ సినిమా ఇది. ఈ మూవీ ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. మెడికల్ మాఫియా, కిడ్నీ మాఫియా లాంటివి చూసుంటాం..కానీ ఇందులో స్కిన్ కు సంబంధించిన మాఫియాను చూపించారు. ఎన్నో ఆశలతో..మారుమూల గ్రామాల్లోంచి అమ్మాయిలు పట్నం వచ్చి..మాఫియా ముసుగులో చిక్కుకుంటే..తమకు తాము ఎలా కాపాడుకోవాలి అనేది ఈ సినిమాలో చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. హన్సిక ఇలాంటి కథను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ అమ్మ స్వతహాగా స్కిన్ డాక్టర్ అవ్వడమే అని ప్రమోషన్స్ లో మేకర్స్ తెలియజేశారు.  

ఇక ఈ సినిమా స్టార్టింగ్ అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డైరెక్టర్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. స్టార్టింగ్ లోనే  స్కిన్ గ్రాఫ్టింగ్ ప్ర‌స్తావ‌న‌తో క‌థ‌ని స్టార్ట్ చేసిన డైరెక్టర్..ఆ త‌ర్వాత పాత్ర‌ల ప‌రిచ‌యానికీ, క‌థను పూర్తిగా నడపడానికి పాత్రల పరిచయానికి కాస్తా టైం..ఎక్కువ తీసుకోవడంతో..కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఆ తర్వాత కొన్ని సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలను..ప్రశ్నలుగా వదులుతూ కథని ముందుకు నడిపించడంలో స్టోరీ లో వేగం పెరుగుతూ వస్తోంది. కానీ, సినిమా నడిచే క్రమంలో..ఏడాది త‌ర్వాత‌, ఆరు నెల‌ల ముందు అంటూ..ముక్క‌లు ముక్క‌లుగా క‌థ‌ని నడిపించడంతో..ఆడియన్స్ కు పరీక్షా పెట్టేలా అనిపిస్తోంది. 

ఇక సెకండాఫ్కి వస్తే..అసలైన సినిమా షురూ అవుతుంది. ఫస్టాఫ్ లో దాగే ప్రతి అంశానికి క్లారిటీ ఇస్తూ వస్తాడు డైరెక్టర్. క్లైమాక్స్ చివ‌రి 20 నిమిషాలు స్టోరీ మ‌రింత ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ట్విస్టులతో..క్రైం మర్డర్ సీన్స్ తో మ‌లుపులు తిరిగే సీన్స్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి.  కొన్ని చోట్ల అసలైన థ్రిల్లింగ్ అంశాలకు లాజిక్‌కి దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా..పల్లెటూరిలోని అమాయ‌కులు పట్నం వచ్చాక..వారి జీవితాల‌తో చెల‌గాట‌మాడే నేర నేప‌థ్యం ఈ క‌థకి ప్రధాన బలం కాగా..ఇటువంటి స‌న్నివేశాల‌తో కథ ముడిపడి ఉన్న..కథలో ఎక్కడ భావోద్వేగాల్ని పండించ‌డంలో డైరెక్టర్ తడబడ్డాడు. 

ఎవ‌రెలా చేశారంటే: 

శృతిగా హ‌న్సిక మోత్వాని చాలా సిన్సీయర్ గా నటించింది. ఒక్కమాటలో జీవించిందని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ,లవ్, ఫ్రెండ్ షిప్, వంటి అంశాలతో హన్సిక పాత్ర పర్వాలేదనిపిస్తోంది. సెకండాఫ్ లో ట్విస్టింగ్ ఎలెమెంట్స్ వచ్చే టైములో హన్సిక నటన ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఈ స్టోరీ లో మరో కీలక పాత్ర పోషించిన పూజా రామ‌చంద్ర‌న్..డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగించే యువ‌తిగా ఒదిగిపోయింది.అలాగే మరో అలనాటి నటి ప్రేమ ఇందులో ముఖ్య పాత్ర పోషించి పర్లేదనిపిస్తుంది. ప్రేమ ఇందులో నెగిటివ్ షేడ్స్ లో తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇక విలన్ గా నటించిన న‌రేన్ యాక్టింగ్ బాగుంది. 

సాంకేతిక నిపుణులు :

డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ థీమ్ కొత్తది. ఇంత వరకి పూర్తీ స్థాయిలో స్కిన్ మాఫియాను ఎవ్వరు టచ్ చేయని అంశం.కానీ స్టోరీ లో మరింత లోతుగా వెళ్లి..తెరకెక్కించి ఉంటె మరింత బాగుండేడి. మార్క్ కె.రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమెరామెన్  కిశోర్ చక్కని ప‌నిత‌నం కనబరిచాడు. నిర్మాణం విలువలు చూసుకుంటే..సినిమా స్థాయికి తగ్గకుండా తెరకెక్కించారు.