క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

గ్రేటర్​ వరంగల్/ జనగామ అర్బన్, వెలుగు: క్షయ వ్యాధికి సకాలంలో చికిత్స అందిస్తే వ్యాధిని నివారించవచ్చని హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, జనగామ అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్​ అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ జిల్లాలోని ఐదు గ్రామాలను క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా ప్రకటించారు. 

ప్రతి ఒక్కరూ క్షయ నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. జనగామలో అవగాహన ర్యాలీ నిర్వహించగా, అడిషనల్​ కలెక్టర్​ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 525 మంది వ్యాధిగ్రస్తులకు రూ.1000 చొప్పున అందజేశారు. నిర్మూలనలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.