ఒత్తిడిలేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి

ఒత్తిడిలేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి

శాయంపేట, వెలుగు:  టెన్త్​ స్టూడెంట్స్​వార్షిక పరీక్షల కోసం ఒత్తిడిలేకుండా సిద్ధం కావాలని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య సూచించారు. హనుమకొండ జిల్లా శాయంపేట, పత్తిపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల కోసం చేసిన సర్వే వివరాలను సోమవారం పరిశీలించారు. మాందారిపేటలోని కేజీబీవీ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వంట సామగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. 

టెన్త్​ స్టూడెంట్స్​పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల సందర్శకులు కలెక్టర్​కు బొకేలకు బదులుగా తెచ్చిన నోట్​బుక్స్​ను విద్యార్థినులకు పంపిణీ చేశారు. ముందుగా శాయంపేట, పత్తిపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, వచ్చిన గ్రీవెన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా, మండల స్థాయి అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కె.నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.