హనుమకొండ, వెలుగు: మడికొండ డంప్‌యార్డును తరలించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కలిసి సోమవారం గ్రీవెన్స్‌లో అప్లికేషన్లు ఇవ్వగా, గురువారం సీఎంహెచ్వో డాక్టర్రాజారెడ్డి, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, ఆస్కీ ప్రతినిధి రాజామోహన్, ఇతర అధికారులు డంప్‌యార్డును విజిట్చేశారు. అప్పటికే డంప్‌యార్డు ప్రభావిత గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని ఆఫీసర్లను ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
గ్రామస్థులను సముదాయించిన అధికారులు పరిసరాలు పరిశీలించారు. ఎయిర్ క్వాలిటీ చెక్ చేసి అక్కడ గాలి కలుషితం అయినట్లు తేల్చారు. డంప్‌యార్డును తరలించాలని వేడుకుంటూ మడికొండకు చెందిన దువ్వ నవీన్, మరికొందరు ఆఫీసర్ల కాళ్లపై పడ్డారు. దీంతో చెత్తనంతా హుజురాబాద్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని, మూడు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.