దుకాణాలపై టాస్క్​ఫోర్స్​ దాడులు

 దుకాణాలపై  టాస్క్​ఫోర్స్​ దాడులు

హనుమకొండ/ పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: ఆహారపదార్థాల దుకాణాలపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ గాంధీనగర్​ పోచమ్మ గుడి సమీపంలోని మొహమ్మద్​ జాన్​ పాషాకు చెందిన షామా అనే ఐస్ క్రీమ్ తయారీ, డిస్ట్రిబ్యూషన్​ షాప్​లో ఫుడ్​సేఫ్టీ నియమాలు,  ఎక్స్పైరీ తేదీలు లేకుండా తయారు చేస్తున్నట్టు  టాస్క్​ ఫోర్స్​పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, పాడైన, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.25,740 విలువైన దాదాపు 14 రకాల  ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్​సీజ్​చేశారు. వరంగల్​జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రగతి ఇండస్ర్టీయల్​ సమీపంలోని కృప బేకరీలో నిర్వహించిన తనిఖీల్లో రూ.32,550 విలువైన 6510 కుళ్లిన కోడి గుడ్లు, బేకరీలో ఉపయోగించే లిక్విడ్​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైడ్స్​లో టాస్క్​ఫోర్స్​ సీఐ బాబులాల్, ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు వేణు, కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.