
ట్రావిస్ హెడ్.. ఈ ఒక్క పేరు టీమిండియా ఫ్యాన్స్ లో కంగారెత్తిస్తుంది. టీమిండియాకు కూడా హెడ్ కొరకరాని కొయ్యలా మారాడు. భారత జట్టు చూడడటానికి బలంగా కనిపిస్తున్నా.. క్లియర్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతున్నా.. ఈ ఆసీస్ ఓపెనర్ మన జట్టుకు పెద్ద సమస్యలా మారాడు. రెండు సార్లు వరల్డ్ టైటిల్స్ ను టీమిండియా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం (మార్చి 4) జరగనున్న సెమీ ఫైనల్స్ లోనూ హెడ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. అతను ఆడితే ఒంటి చేత్తో ఆసీస్ కు విజయాన్ని అందిస్తాడు.
ట్రావిస్ హెడ్ ను ఎంత వేగంగా ఔట్ చేస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ ను హెడ్ తెగ టెన్షన్ పెడుతున్నాడు. క్రికెట్ ఎక్స్ పర్ట్స్ సైతం భారత్ మ్యాచ్ గెలవాలంటే హెడ్ ను త్వరగా ఔట్ చేయాలని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు ఒక విషయం ఊరటనిస్తోంది. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హెడ్ పై మంచి రికార్డ్ ఉండడమే ఇందుకు కారణం. వన్డేల్లో పాండ్య బౌలింగ్ లో హెడ్ ఇప్పటివరకు 21 పరుగులు మాత్రమే చేసి రెండు సార్లు ఔటయ్యాడు. హార్దిక్ బ్యాక్ ఆఫ్ ఎ లెంగ్త్ డెలివరీలను ఆడడంలో గతంలో హెడ్ ఇబ్బంది పడతాడు. దీంతో సెమీ ఫైనల్లోనూ పాండ్యపైనే భారత్ ఆశలు పెట్టుకుంది.
భారత్ ఆతిథ్యమిచ్చిన 2023 వన్డే ప్రపంచ కప్.. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతని శతకంతో సొంతగడ్డపై రోహిత్ శర్మ అండ్ కో ప్రపంచకప్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక రెండోవది.. అదే ఏడాది జూన్‌గిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అతడే అడ్డుపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఏకంగా 163 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హెడ్‌కు భారత్‌పై అద్భుతమైన వన్డే రికార్డు ఉంది. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 43.12 సగటు, 101.76 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా భారత్‌పై అతని సగటు 75.33. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో 118.32 స్ట్రైకింగ్ రేట్‌తో 226 పరుగులు చేశాడు. ఇదే భారత అభిమానులను భయపెడుతోంది. దాంతో, ఏకంగా భారత జెర్సీ కలర్ మార్చేయమని సూచిస్తున్నారు.