ఐపీఎల్ లో హార్దిక్ పాండ్య కష్టాలు కొనసాగుతున్నాయి. నిన్న (ఏప్రిల్ 30) లక్నోతో మ్యాచ్ ఓడిపోయిన ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకుంది. అసలే ఓటమి.. ఆపై ప్లే ఆఫ ఆశలు గల్లంతు. ఈ బాధలో పాండ్యకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ టోర్నీలో రెండోసారి స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పాండ్యకు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది.
కెప్టెన్ పాండ్యకు మాత్రమే కాదు.. ముంబై జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. జట్టులోని ప్లేయింగ్ 11 లో ఉన్న వారికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. హార్దిక్ పాండ్య మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురయితే 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. ఈ టోర్నీలో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ స్లో ఓవర్ రేట్‌తో 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న తొలి ప్లేయర్ గా నిలిచాడు.
ఈ లిస్టులో పంత్ రెండు సార్లు.. సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్,గిల్ ఒకసారి స్లో ఓవర్ రేట్‌ను ఎదుర్కొన్నారు. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్ లో పాండ్య బ్యాటింగ్ లో తొలి బంతికే డకౌటయ్యాడు. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో రాణించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట ముంబై 144 పరుగులు చేయగా.. లక్నో బ్యాటర్లు 19.2 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఛేదనలో స్టోయినిస్(62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదగా.. కేఎల్ రాహుల్ 28 పరుగులు చేశారు.
Hardik Pandya has been fined 24 Lakhs for the slow over-rate against Lucknow.
— Johns. (@CricCrazyJohns) May 1, 2024
- If he gets one more slow over rate then he will be banned for one match. pic.twitter.com/eWkxp5aEXe